

అంధ్రములో అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటిగా భావించబడే శ్రీకాకుళం ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్‌తో కలిసి భారతదేశంలో తొలిసారిగా AI ఆధారిత సముద్ర ఆక్వాకల్చర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ₹2,500 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. 500 ఎకరాల్లో నిర్మించబడనున్న ఈ మెగా పార్క్ శ్రీకాకుళంను ఆధునిక ఆక్వాకల్చర్‌లో గ్లోబల్ మ్యాప్‌లో నిలబెడుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలు, 10,000 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. మత్స్యకారులు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర యువతకు ఇది భారీ ఉపాధి అవకాశాలను అందిస్తుంది. పార్క్ ప్రారంభం తర్వాత ₹2,000 కోట్ల నేరుగా ఎగుమతులు, ₹20,000 కోట్ల పరోక్ష ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదనంగా, ఆక్వాకల్చర్ స్కిల్ & ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఐదేళ్లలో 5,000 స్థానిక యువతకు శిక్షణ, సర్టిఫికేషన్ లభిస్తుంది. భారతదేశంలో ఇదే తొలి AI ఆధారిత ఆక్వా పార్క్ కావడం ప్రత్యేకత. ఇందులో రొయ్యలు, చేపల బ్రిడింగ్ యూనిట్లు, ఇండోర్ వాటర్-ఫార్మింగ్ షెడ్లు, ట్యాంక్ ఆధారిత గ్రోవింగ్ సిస్టమ్స్, ఆధునిక ప్రాసెసింగ్ సెంటర్లు, సీఫుడ్ లాబ్, అన్ని కార్యకలాపాలను నియంత్రించే AI ఆధారిత స్మార్ట్ కంట్రోల్ రూమ్ ఉంటాయి. బ్లూటెక్OS ఆధారంగా ఈ వ్యవస్థ విజాగ్ నుండి నిర్వహించబడుతుంది.
ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు భూమిని త్వరగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
ఏప్రిల్ 2025లో సీఎం చంద్రబాబు ప్రకటించిన మత్స్యకార సేవ పథకంలో భాగంగా ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని కేవలం ఆరు నెలల్లోనే నెరవేర్చినట్టైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!