

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కేసు విషాదాంతమైంది. అతడు మరణించినట్టు స్థానిక పోలీసులు ధ్రువీకరించగా, అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ వెల్లడిస్తూ, మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేసింది. సాకేత్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అతడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు స్థానిక అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సాకేత్ ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో కెమికల్ మరియు బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నారు. ఫిబ్రవరి 9 నుంచి ఆయన కనిపించకుండా పోయారు. చివరిసారిగా బర్క్లీ హిల్స్‌లోని అన్జా సరస్సు సమీపంలో కనిపించినట్లు సమాచారం. అక్కడే అతడి పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్ లభించగా, అనంతరం పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!