
న్యూస్

ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పారావు మాట్లాడుతూ, ఆ నిర్మాతకు కానీ, అతని కొడుకుకు కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ఆ నొప్పి అర్థమవుతుంది. ఎన్కౌంటర్ చేయాలని చెప్పే హక్కు సినిమా వ్యక్తులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
పోలీసులు విధి ప్రకారం విచారణ చేస్తున్న సమయంలో సినిమా వర్గాలు ఇలా జడ్జిమెంట్లు ఇవ్వడం తగదని ఆయన తెలిపారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి, చివరికి భారాన్ని జనాలపై మోపుతున్నారు. సమస్యలు వస్తే నిందను ఇతరులపై వేస్తున్నారు, అని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో, కస్టడీలో ఉన్న రవి తనతో ఇప్పటివరకు రెండుసార్లు మాట్లాడాడని అప్పారావు తెలిపారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబం ఆందోళన చెందుతోందని చెప్పారు.
















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!