
.png&w=3840&q=75)
కొండగట్టు అంజన్న స్వామి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పించినందుకు తన ఇష్టదైవానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు పునర్జన్మ ప్రసాదించి, అడుగడుగునా ధైర్యం, బలం ఇచ్చి నడిపిస్తున్న కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులతో ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రతిపాదన చేసిన వెంటనే ముందుకొచ్చి నిధులు మంజూరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే తిరుమల శ్రీవారి భక్తులందరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల సహాయంతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కలగాలని, స్వామివారి కృపతో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా, కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 35.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం వంద గదుల ధర్మశాల, దీక్షామండపం వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!