

దేశీయ వాహన రంగంలో కార్ల ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రీమియం బ్రాండ్లు ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా హ్యూండాయ్ మోటార్ ఇండియా కూడా అదే బాటలో నడిచింది.
విలువైన లోహాలు, ఇతర ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు కంపెనీ బుధవారం వెల్లడించింది. అన్ని వాహనాలపై గరిష్టంగా 0.6 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
ఖర్చులను సాధ్యమైనంతవరకు నియంత్రించి, వినియోగదారులపై భారం పడకుండా చూడటానికి ప్రయత్నించామని సంస్థ స్పష్టం చేసింది. అయితే, క్రమంగా పెరుగుతున్న వ్యయాల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి తప్పలేదని పేర్కొంది.
ప్రస్తుతం హ్యూండాయ్ మోటార్ ఇండియా సంస్థ ఐ10 హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐయోనిక్ ఫైవ్ వరకు విభిన్న మోడళ్లను విక్రయిస్తోంది. ఈ వాహనాల ఎక్స్‌షోరూమ్ ధరలు సుమారు ఐదు లక్షల నలభై ఏడు వేల రూపాయల నుంచి నలభై ఏడు లక్షల రూపాయల వరకు ఉన్నాయి.






.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!