
న్యూస్

ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ కేసులో ఫినో పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ రిషి గుప్తాను డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో భారీగా జీఎస్టీ ఎగ్గొట్టినట్లు విచారణలో బయటపడిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
సుమారు రూ.13 కోట్ల విలువైన లావాదేవీలు ఈ సిండికేట్ ద్వారా జరిగినట్లు గుర్తించగా, వాటిలో ఎక్కువ భాగం ఫినో బ్యాంక్ ద్వారా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం రూ.840 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్లు డీజీజీఐ ఆరోపించింది. రిషి గుప్తాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, దర్యాప్తు కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!