

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లో తీవ్రంగా ఉన్న వాయు కాలుష్యం తాజాగా హైదరాబాద్‌కూ ముప్పుగా మారింది. నగరంలో వాయు నాణ్యత సూచీ (AQI) 255కు చేరుకుని ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక మరియు రద్దీ ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా నమోదవుతోంది. శీతాకాలపు పొగమంచుతో పాటు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం కారణంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాల మోతాదు పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు మాస్కులు ధరించాలని, ఉదయం వేళల్లో వ్యాయామాలను నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఢిల్లీలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ AQI స్థాయిలు 400 నుంచి 500 మధ్య ఉండటంతో ‘అత్యంత ప్రమాదకర’ కేటగిరీలో కొనసాగుతోంది. దట్టమైన పొగమంచు వల్ల విజిబిలిటీ తగ్గి విమాన, రైలు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం GRAP-4 కింద కఠిన ఆంక్షలు విధించి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!