
న్యూస్

ఎల్పీజీ సరఫరా సమస్య తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో హోటల్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను బంద్ చేసే అవకాశం ఉందని హోటల్ ఓనర్లు పేర్కొంటున్నారు. ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడం వల్ల హోటళ్లను నడపడం అసాధ్యమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్పీజీ లేకపోతే వంట కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోతాయని, దాంతో ఆటోమేటిక్గా హోటల్స్ మూతపడతాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కూడా హోటళ్లు బంద్ అవుతున్న పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యాలు కోరుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!