

కేదార్‌నాథ్ యాత్రలో గుజరాత్‌కు చెందిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని తరలించే విషయంలో తీవ్ర ఆలస్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం, ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన తండ్రి మృతదేహం గంటల పాటు అక్కడే ఉండిపోయిందన్నారు. మొదట మృతదేహాన్ని కాలినడకన కిందకు తీసుకెళ్లాలని సూచించారని, ఆ పరిస్థితుల్లో తామే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. చివరకు సుమారు రూ.65 వేల ఖర్చుతో ప్రైవేట్ హెలికాప్టర్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన కుమారుడు, వీఐపీ ప్రయాణాల కోసం హెలికాప్టర్లు సులభంగా అందుబాటులో ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఆలస్యం, అధిక ఖర్చులతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రశ్నించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎత్తైన యాత్ర ప్రాంతాల్లో అత్యవసర సేవలు, సౌకర్యాల అందుబాటు, సాధారణ యాత్రికులు ఎదుర్కొనే సమస్యలపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అధికారులు ఇప్పటివరకు పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేదు.















.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!