

గోవాలోని ఒక ప్రముఖ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో సరదాగా నాట్యం, సంగీతం కొనసాగుతుండగా ఒక్కసారిగా పైకప్పు నుంచి నిప్పు కణాలు పడుతూ మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది. కొన్ని క్షణాల్లోనే హాల్ మొత్తం పొగతో నిండిపోగా, డ్యాన్సర్‌తో పాటు అక్కడున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. పైకప్పు నుంచి మండుతున్న మలినాలు కిందికి పడుతూ జనాల్లో భయాందోళనలకు కారణమయ్యాయి.
ఈ దుర్ఘటనలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, మరికొంతమంది గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ప్రకారం, గ్యాస్ సిలిండర్ పేలుడే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ ప్రారంభించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.









.png&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!