
రాజకీయాలు

ప్రముఖ వ్యాపారవేత్త, హిందుజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి. హిందుజా (85) కన్నుమూశారు. లండన్లోని ఒక ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. వ్యాపార రంగంలో “జీపీ”గా పేరుపొందిన గోపీచంద్, హిందుజా సోదరుల్లో అగ్రజుడు. హిందుజా కుటుంబానికి రెండో తరం ప్రతినిధిగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. 2023 మే లో తన సోదరుడు శ్రీచంద్ హిందుజా మరణం తర్వాత గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి సంస్థను ముందుకు నడిపించారు.
1959లో ముంబై జైహింద్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన గోపీచంద్ అదే ఏడాది కుటుంబ వ్యాపారంలో చేరారు. ఇండో-మిడిల్ ఈస్ట్ వ్యాపార సంబంధాల విస్తరణలో కీలక పాత్ర పోషించారు.
ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్ ఉన్నారు. వీరే ప్రస్తుతం హిందుజా గ్రూప్ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తున్నారు.











కామెంట్స్ (1)
Rest in peace, legend