

ఎండాకాలంలో ఎక్కువగా లభించే పాల పండ్లు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పండ్లలో ఒకటి. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిన ఈ పండ్లు ప్రస్తుతం ధరలో మటన్‌తో పోటీ పడుతున్నాయి. పాల పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
పాల పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఆకలిని పెంచుతాయి. కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేసవిలో వీటిని తింటే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ పండ్ల ధర కిలోకు రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతోంది.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.







.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!