

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక కీలక మలుపుగా, తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఏకమై ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (SIFPA)ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన అగ్ర నిర్మాతలు, గిల్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో ఉమ్మడి ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కొత్త కూటమి ఏర్పాటైంది.
థియేట్రికల్ నిబంధనలు, ఎనిమిది వారాల ఓటీటీ రిలీజ్ విండో వంటి కీలక అంశాలపై ఇతర వర్గాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. నిర్మాతలే ప్రధాన రిస్క్ తీసుకునే వర్గమని, వారి అభిప్రాయం లేకుండా తీసుకునే నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళానికి దారితీస్తాయని స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ప్రతినిధులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి, సినిమాల విడుదల, హక్కులు, వ్యాపార నిర్ణయాలపై పూర్తి అధికారం నిర్మాతలకే ఉంటుందని ‘సిఫ్పా’ వెల్లడించింది.





.jpg.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!