

తిరుమల ప్రాంతం లో దిత్వా తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం తో అక్కడి పర్యాటక, దర్శన మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. ఆదివారం పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను భద్రతా కారణాల వల్ల తాత్కాలికంగా మూసివేశారు.
ఘాట్ రోడ్డు లో ప్రయాణించే వాహనదారులను అలిపిరి వద్ద తితిదే భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. వర్షపాతం పెరగడం తో తిరుమల లోని ఐదు రిజర్వాయర్లు పూర్తిగా నిండి ప్రవాహాలు పెరిగాయని తితిదే వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
గోగర్భం మరియు పాపవినాశనం డ్యామ్‌లలో ఒక్కో గేటు తెరిచి అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుధార రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో జలధారలు శోభాయమానంగా ప్రవహిస్తున్నాయి. తిరుమలలోని తీర్థాలు, జలపాతాలు ఈ వర్షాలతో మరింత ఉప్పొంగి సుందర దృశ్యాలను సృష్టించాయి.




















కామెంట్స్ (1)
తిరుమల వర్షాలు అద్భుతం, కానీ భద్రత ముందు! 🌧️🙏