
సినిమాలు

టీటీడీ లడ్డు కేసులో హవాలా కోణం ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నిధులు హవాలా రూపంలో మళ్లించారని ప్రాథమికంగా అంచనా వేస్తోంది. నిందితులు పోమిలి జైన్, విపుల్ జైన్‌తో పాటు బోలే బాబా ఆర్గానిక్ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడ వంటి నగరాలకు హవాలా డబ్బులు చేరినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ అక్రమ లావాదేవీల ద్వారా రూ.234.5 కోట్లకు పైగా నిధులు మళ్లించబడినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన ఈడీ, డబ్బుల మార్గాన్ని పూర్తిగా గుర్తించే పనిలో నిమగ్నమైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!