
సినిమాలు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
రాష్ట్రంలో సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుపై తన ఆసక్తిని సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, అందుకు ఉన్న అవకాశాలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు.
ఫిలిం స్టూడియోలు మరియు ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా సినిమా, వినోద రంగాల్లో విస్తృతంగా ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి సంజయ్ దత్‌ను ఆహ్వానించారు.

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!