
సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
ప్రస్తుతం ఈ సినిమాను త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రముఖ ప్లాట్‌ఫామ్ Netflix ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన విజయం, ఓటీటీలో సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!