

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూసేకరణ పూర్తి చేసి 300 ఎకరాల భూమిని కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రికి అందించడం గర్వకారణమన్నారు. గతంలో నిర్లక్ష్యంతో ఆలస్యం అయిన మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌ను తిరిగి పట్టాలెక్కించామని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు దీర్ఘ చరిత్ర ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సుమారు 850 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, రాష్ట్రాల సహకారంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయ మౌలిక వసతులను విస్తరించడమే లక్ష్యమన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!