
టెక్నాలజీ

ఉత్తర కరోలినా రాష్ట్రంలోని సౌత్‌పోర్ట్ తీర ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన కాల్పులు అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఒక దుండగుడు పడవ నుండి స్థానిక తీర బార్‌పై కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందగా, కనీసం ఎనిమిది మందికి పైగా గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు.
ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇంకా ఆ ప్రాంతం సురక్షితం కాదని, స్థానికులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని అధికారాలు హెచ్చరించారు.
విల్మింగ్టన్కు దక్షిణంగా సుమారు 30 మైళ్ళ దూరంలో ఉన్న ఈ చిన్న తీర పట్టణం ఒక్కసారిగా హడలిపోయింది. ఒకప్పుడు సురక్షితంగా భావించిన ప్రజాస్థలాల్లో అమెరికాలో తరచుగా జరుగుతున్న కాల్పుల జాబితాలో ఈ ఘటన కూడా చేరింది.










కామెంట్స్ (1)
So sad