
టెక్నాలజీ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇవాళ(సోమవారం) నుంచి రెండు రోజులపాటు అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే, గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతి నివాసంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని సీఎం చంద్రబాబు చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ దృష్ట్యా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు సీఎం చంద్రబాబు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణ, పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!