

సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబితాలో సీనియర్ న్యాయవాది వి. మోహనతో పాటు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, పంజాబ్ హరియాణా హైకోర్టు సీజే జస్టిస్ షీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్, జమ్మూకశ్మీర్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ పళ్లి ఉన్నారు.
ఇటీవల సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వీరి పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో వి. మోహన ఒక్కరే సీనియర్ న్యాయవాది. ఆమె 1988లో కోయంబత్తూరు లా కాలేజీ నుంచి పట్టా పొంది, తొలి ఐదేళ్ల లా బ్యాచ్‌లో చదివారు. ఇందు మల్హోత్రా, సి.ఎస్. వైద్యనాథన్ వద్ద జూనియర్‌గా పనిచేసి, 1996లో ఏఓఆర్ పరీక్ష పాసైన తర్వాత సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కపిల్ సిబల్, కె.కె. వేణుగోపాల్, పి. చిదంబరం, అరుణ్ జైట్లీ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. 2015 ఏప్రిల్ 23న సీనియర్ న్యాయవాది హోదా పొందారు. ఆమె నియామకంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!