

ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశంలో లభ్యమయ్యే మామిడి రకాల వైవిధ్యాన్ని వివరించారు. ఫలాల్లో మామిడి రాజు అని పేర్కొంటూ, ప్రతి ప్రాంతంలో మామిడికి ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రలో ఆల్ఫోన్సో, గుజరాత్‌లో కేసరి, ఉత్తరప్రదేశ్‌లో దశహరీ, పశ్చిమ బెంగాల్‌లో హిమసాగర్ వంటి రకాలను ప్రస్తావించారు. దక్షిణాదిలో బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు ప్రసిద్ధి చెందాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో సువర్ణరేఖ, బిహార్‌లో జర్దాలు, వారణాసిలో లాంగ్రా రకాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయని వివరించారు. ప్రాంతాల వారీగా మామిడి రుచి, ఆకారం, రంగు మారుతాయని చెప్పారు.
దేశంలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగినంత నీరు తాగాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. మరోవైపు రాంచీలో జరిగిన పోటీల్లో జాతీయ రికార్డులు సృష్టించిన గురీందర్‌వీర్ సింగ్, అనిమేష్ కూజూర్‌లతో మోదీ ముచ్చటించారు. 100 మీటర్ల పరిగెత్తులో తక్కువ వ్యవధిలో మూడు రికార్డులు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!