

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా చేశారన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఐఆర్‌జీసీ దళాల పెరుగుతున్న ప్రభావంపై అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి తన రాజీనామా లేఖను పంపినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీలక నిర్ణయాల్లో ప్రభుత్వ అధికారులను పక్కన పెట్టడం, తన బాధ్యతలను నిర్వర్తించనీయకపోవడం వంటి అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ రాజీనామాపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది.
ఇక ఈ వార్తలను ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఖండించింది. కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి మీడియాపై విమర్శలు గుప్పించారు. అమెరికాతో జరుగుతున్న చర్చల సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తుర్కియే ప్రభుత్వ పత్రిక కూడా ఈ ఖండనకు మద్దతు తెలిపింది. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందంలో మార్పులు కోరుతూ అణ్వాయుధాల కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ స్పందిస్తూ దేశ హక్కులను కాపాడని ఏ ఒప్పందానికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!