
జనరల్

దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ఈరోజు నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఢిల్లీలో రూ.42 పెంపు విధించడంతో అక్కడ ఒక్కో సిలిండర్ ధర రూ.3,113.50కు చేరుకుంది.
ఈ ధరల పెంపు ప్రభావం ఇతర ప్రధాన నగరాలపైనా పడింది. హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.3,294కు చేరుకోగా, చెన్నైలో రూ.3,232గా నిర్ణయించారు. కోల్‌కతాలో అత్యధికంగా రూ.53.50 పెంపు నమోదవడంతో అక్కడ ఒక్కో సిలిండర్ ధర రూ.3,255కు చేరింది.
అలాగే ఐదు కిలోల స్వేచ్ఛా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను రూ.11 మేర పెంచారు. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సాధారణ వినియోగదారులకు ఉపశమనం లభించినప్పటికీ, హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!