

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్కూళ్లు జూన్లో తిరిగి ప్రారంభం అయ్యే నాటికి అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పూర్తి వసతులు ఉండాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్టళ్లు పరిశుభ్రంగా, విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని తెలిపారు. టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే నిధులు కేటాయించిన నేపథ్యంలో ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల నిర్లక్ష్యంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చాలని, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, చెత్త సేకరణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే వ్యవస్థ ఉండాలని, పనులు పూర్తయ్యాక ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని తెలిపారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడం, నీటి నమూనాలను తరచూ పరీక్షించడం అవసరమని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో మంచి ఫలితాలు కన్పించాలంటే స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని సూచిస్తూ, తాడిపత్రిని స్వచ్ఛతలో ఆదర్శంగా పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!