

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే ఔట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించి, రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ తరఫున తొలి బంతికే ఔటైన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్ 2018లో ఇదే రికార్డు నమోదు చేశాడు.
ఇక టీ20 క్రికెట్లో ఒకే ఏడాదిలో అత్యధిక డకౌట్లు నమోదుచేసిన భారత ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ తొలి స్థానంలో నిలిచాడు. అతను ఏడు సార్లు డకౌట్ అయ్యాడు. తరువాత రోహిత్ శర్మ, సంజు శాంసన్ ఉన్నారు. ఇదే సమయంలో జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్లో నాలుగోసారి తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. కాగా మహ్మద్ షమీ ఐదు సార్లు ఈ ఘనత సాధించి ముందంజలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ 24 సార్లు తొలి బంతికే వికెట్ తీసి అగ్రస్థానంలో ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!