

లెజెండరి పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ భారతదేశంలో ఊహించని స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. డబ్బింగ్ లేకుండా కేవలం ఇంగ్లీష్ వెర్షన్‌లో విడుదల అవుతున్నప్పటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడం విశేషం.
ఈ చిత్రంలో మైఖేల్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు సమాచారం. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రీమియర్ షోలు దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయి. జెన్ జీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో మైఖేల్ జాక్సన్ ప్రభావం ఎంత ఉందో ఈ స్పందనతో మరోసారి స్పష్టమవుతోంది. ఇండియాలో ఇంగ్లీష్ సినిమాలకు పెరుగుతున్న మార్కెట్‌కు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.




.webp&w=3840&q=75)






.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!