
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మరియు భోజనశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక హోటళ్లు తమ కార్యకలాపాలను కొనసాగించడం కష్టంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో పలు హోటళ్లు పూర్తిగా మూతపడే అవకాశముందని యజమానులు చెబుతున్నారు.
ఈ ప్రభావం తిరుపతి, ప్రాంతంలో కూడా కనిపిస్తోంది. అక్కడ చాలా హోటళ్లలో వంటలను కట్టెల పొయ్యిలపై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కట్టెల ధరలు కూడా పెరగడంతో యజమానులకు మరింత భారంగా మారింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హోటల్ యజమానులు అధికారులను కోరుతున్నారు.







.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!