

ప్రముఖ అమెరికన్ రియాలిటీ షో ‘స్టోరేజ్ వార్స్’ ఫేమ్ డారెల్ షీట్స్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆరిజోనాలోని ఆయన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. వేలాల్లో భారీ రిస్క్‌లు తీసుకునే ఆయన ప్రత్యేక శైలికి అభిమానులు ఆయనను ప్రేమగా “ది గ్యాంబ్లర్” అని పిలిచేవారు. 160కి పైగా ఎపిసోడ్లలో నటించిన ఆయన, “This is the WOW factor!” అనే డైలాగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
2010లో ప్రారంభమైన ‘స్టోరేజ్ వార్స్’ షోలో డారెల్ షీట్స్ ఒక ఐకానిక్ వ్యక్తిగా నిలిచారు. పాత స్టోరేజ్ యూనిట్లను వేలంలో కొనుగోలు చేసి, వాటిలో దాగి ఉన్న విలువైన వస్తువులను గుర్తించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది. 2012లో కేవలం $3,600తో కొనుగోలు చేసిన యూనిట్లో సుమారు $3 లక్షల విలువైన పెయింటింగ్స్‌ను కనుగొని రికార్డు సృష్టించారు. 2019లో గుండెపోటుకు గురైన తర్వాత ఆయన టెలివిజన్ రంగానికి విరామం ఇచ్చి ఆరిజోనాకు మారి, పురాతన వస్తువుల దుకాణాన్ని నిర్వహించారు. ఆయన మరణం హాలీవుడ్ రియాలిటీ టీవీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!