
టెక్నాలజీ

రాష్ట్రంలోని చేనేత మరియు మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు.
ఈ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నేత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. తాజా బడ్జెట్లో ఈ ఉచిత విద్యుత్ పథకానికి అవసరమైన నిధులు కేటాయించడంతో, ఏప్రిల్ 1 నుంచి అమలు ప్రారంభమవుతుంది.
ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల కుటుంబాల తరఫున చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల చేనేత రంగానికి ఊతం లభిస్తుందని, కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!