

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధృవీకరణ పత్రాలు కలిగిన దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నంలో రూ. 2,387 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించనుంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా పలు పర్యాటక మరియు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపారు. కల్తీ పాలు, డయేరియా ఘటనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాలు ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నవిగా ప్రభుత్వం పేర్కొంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!