

అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కు వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా కీలక పదవి దక్కింది. ఈ విషయాన్ని మంగళవారం డబ్ల్యూసీఏ ప్రకటించింది. రషీద్‌తో పాటు చమారి ఆటపట్టు, డారిల్ మిచెల్, వేన్ మాడ్సెన్, మాడీ గ్రీన్‌లకు కూడా కొత్త సభ్యులుగా చోటు దక్కింది. ఈ పదవి ద్వారా ప్రపంచ క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంటుంది.
ఈ నియామకాలు టిమ్ సౌథీ పదవీ విరమణ, సోఫీ డివైన్ నిష్క్రమణ తర్వాత జరిగాయి. వారి సేవలను డబ్ల్యూసీఏ ప్రశంసించింది. 2018లో స్థాపించబడిన ఈ బోర్డు, ఐసీసీ ఈవెంట్లు, షెడ్యూలింగ్, వాణిజ్య అంశాలపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రతిబింబించడం లక్ష్యంగా పనిచేస్తోంది. 17 ప్రధాన క్రికెట్ దేశాల ప్రాతినిధ్యంతో ఈ బోర్డు క్రికెట్ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతోంది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!