

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ మంచి సౌకర్యం కల్పించింది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ నెల 16 నుంచి వచ్చే నెల 1 వరకు జరిగే పరీక్షల సమయంలో విద్యార్థులు ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి, తిరిగి ఇంటికి చేరడానికి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం APSRTC నిర్వహించే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. బస్సులో ఎక్కినప్పుడు విద్యార్థులు తమ టెన్త్ హాల్ టికెట్ చూపిస్తే చాలని కండక్టర్లకు సూచనలు ఇచ్చారు.
ఈ నిర్ణయం వల్ల పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం సులభమవుతుందని అధికారులు తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!