
సినిమాలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి భుజంగరావుకు సంబంధించిన నివాసాలు, ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదనపు పోలీసు అధికారి హోదాలో పనిచేసిన భుజంగరావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గతంలోనే ఆయనను సస్పెండ్ చేసింది.
తాజాగా ఆయన నివాసాలతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు పదిహేను ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!