
సినిమాలు

హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన నేర కేసుల్లో నేపాల్‌కు చెందిన దాదాపు 200 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 160 మందికిపైగా గతంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆచూకీ లేకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.
ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు సంచలన కేసుల నేపథ్యంలో వీరి కోసం గాలింపును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో పాటు నేర విభాగాల అధికారులు కూడా ఈ కేసులపై దృష్టి సారించారు. నిందితులు తమ సమాచార మార్పిడి కోసం సాధారణ మార్గాలకు బదులుగా ఇతర సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వారి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!