
రాజకీయాలు

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని పాత గంగంపాలెం సమీపంలో పెద్దపులి దాడి చేసి 14 ఆవు దూడలను చంపడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గత వారం రాజవొమ్మంగి మండలంలో ఏడు మూగజీవులను బలిగొన్న ఇదే పెద్దపులి అనంతరం గంగవరం పరిసర అటవీ ప్రాంతాల్లో సంచరించి, తాజాగా దేవీపట్నం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
వరుస దాడులతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులు తమ పశువులను బయటకు వదిలేందుకు భయపడుతుండగా, రాత్రి వేళల్లో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు, నిఘా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అటవీశాఖను కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!