
సినిమాలు

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పట్ల ఓ అభిమాని చూపిన ప్రత్యేక అభిమాన ప్రదర్శన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే పార్టీ కార్యకర్త తన ఇంటి పూజా మందిరంలో విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ హారతి ఇవ్వడం, పూజలు నిర్వహించడం చేస్తున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. కొందరు అతని అభిమానాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు సినిమా నటులు లేదా రాజకీయ నాయకులపై అభిమానం ఉండొచ్చని, అయితే అది అతిగా మారకూడదని అభిప్రాయపడుతున్నారు. పూజా మందిరంలో అభిమాన నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!