

ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని 40 ఏళ్లలోపు స్వయంకృషితో బిలియనీర్లుగా ఎదిగిన వారి జాబితాలో నలుగురు భారతీయ వంశస్థ ఉద్యమకర్తల చోటు దక్కించుకున్నారు. ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ రంగాల్లో వీరు సాధించిన విజయాలతో కలిసి వీరి మొత్తం సంపద 11 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువ ఉద్యమకర్తల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ జాబితాలో 19వ స్థానంలో అంకూర్ జైన్ (35) నిలిచారు. న్యూయార్క్‌కు చెందిన బిల్ట్ రివార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన ఆయన సంపద సుమారు 3.4 బిలియన్ డాలర్లు. 20వ స్థానంలో నిఖిల్ కామత్ (39) ఉన్నారు. జీరోధా సహ-వ్యవస్థాపకుడు అయిన ఆయన నికర విలువ 3.3 బిలియన్ డాలర్లు. అలాగే కేవలం 22 ఏళ్ల వయసులోనే AI ఆధారిత హైరింగ్ స్టార్టప్ ‘మెర్కర్’ను ప్రారంభించిన ఆదర్శ్ హైర్మత్ మరియు సూర్య మిధా కూడా ఈ జాబితాలో 27వ స్థానంలో నిలిచారు. ఒక్కొక్కరి సంపద సుమారు రూ.1,826 కోట్లు. వీరి విజయాలు భారతీయ యువత ప్రపంచ టెక్ రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నదానికి నిదర్శనం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!