
న్యూస్
.webp&w=3840&q=75)
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి తమ వల విసిరారు. మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ స్టాక్ మార్కెట్లో అధిక లాభాల ఆశతో మోసపోయినట్లు తెలిసింది. వాట్సాప్ ద్వారా సంప్రదించిన నిందితులు నకిలీ ట్రేడింగ్ టిప్స్, తప్పుడు స్క్రీన్షాట్లు పంపుతూ పెట్టుబడులు పెట్టేలా ఆమెను నమ్మించారు.
ఖాతాలో లాభాలు కనిపిస్తున్నప్పటికీ డబ్బును విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో మోసం బయటపడింది. ఈ ఘటనలో ఆమె నుంచి సుమారు రూ.2.58 కోట్లను నేరగాళ్లు కాజేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!