
న్యూస్

రష్యాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ దేశానికి చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం ఏఎన్-26 మోడల్‌కు చెందినది. ఇది క్రిమియా ప్రాంతం మీదుగా వెళ్తుండగా అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయి కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో 23 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది మృతి చెందారు. సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణశాఖ తెలిపింది. విమానంపై ఎలాంటి దాడి జరగలేదని కూడా స్పష్టం చేసింది. ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!