
రాజకీయాలు

మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘హరుడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హీరో వెంకట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వచ్చే నెల 8 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని వాణిజ్య అంశాలతో ఈ చిత్రం రూపొందిందని చిత్రబృందం వెల్లడించింది.
రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, సలోని, నటాషా, శ్రీహరి, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా, ఆనంద్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. ఈ సినిమా వెంకట్‌కు మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!