
బిజినెస్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్దతుగా ముందుకు వచ్చింది. ప్రతి సంవత్సరం కనీసం ఒక మంచి పని చేయాలని చెప్పే అల్లు అర్జున్ మాటలతో ప్రేరణ పొందిన ఈ సంఘం, ఏడాది మొత్తం హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా చిన్న వయసు అమ్మాయిలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించవచ్చు. 9 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ “స్వస్థ నారి విక్సిత భారత్” కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయం అందిస్తున్నారు.ఈ నెల 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి సామాజిక ప్రయత్నంగా ప్రశంసలు పొందుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!