

కార్మేని సెల్వం చిత్రం సంగీత రంగంలో కొత్త విధానాన్ని పరిచయం చేస్తోందని సంగీత దర్శకుడు రామానుజన్ తెలిపారు. పాత్‌వే ప్రొడక్షన్స్ సంస్థపై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అరెరె పాట భావోద్వేగంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం వచ్చే నెల 3 న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రానికి సంప్రదాయ పద్ధతికి భిన్నంగా ఒక సంస్థ పేరుతో సంగీతాన్ని అందించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. సంగీత నిర్మాణ వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని రామానుజన్ తెలిపారు. ఈ చిత్రానికి నాలుగు పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చగా, బృందంగా కలిసి పనిచేసిన ఫలితంగా మంచి ఫలితం వచ్చిందన్నారు. కుటుంబ భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!