
న్యూస్

యూరప్‌లో విచిత్రమైన కార్గో దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్తున్న ట్రక్‌లో ఉన్న సుమారు 4 లక్షలకు పైగా కిట్‌కాట్ చాక్లెట్లు, దాదాపు 12 టన్నుల సరుకు మాయం అయినట్లు సమాచారం. నెస్లే సంస్థకు చెందిన ఈ సరుకు గమ్యస్థానానికి చేరుకునేలోపే అదృశ్యమవడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యూరప్‌లో పెరుగుతున్న కార్గో దొంగతనాల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. దొంగిలించిన చాక్లెట్లు అనధికార మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉందని నెస్లే హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన భారీ స్థాయిలో జరగడం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.




.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!