

వాట్సాప్ యూజర్లకు మరింత సౌకర్యం, భద్రత కల్పించేందుకు తరచూ కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. తాజాగా “ఆఫ్టర్ రీడింగ్” అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్‌ను చదివిన కొద్దిసేపటికే అది ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. రిసీవర్ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే 15 నిమిషాల టైమర్ ప్రారంభమై, ఆ సమయం పూర్తయ్యాక మెసేజ్ ఇద్దరి చాట్ నుంచి కూడా మాయం అవుతుంది.
రిసీవర్ మెసేజ్‌ను ఓపెన్ చేయకపోతే, అది 24 గంటల వరకు అలాగే ఉండి తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. ఓటీపీలు, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, అడ్రస్, లొకేషన్ వంటి సున్నితమైన సమాచారం పంపేవారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బ్లూ టిక్స్ ఆఫ్ చేసినా కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న డిసప్పీరింగ్ మెసేజెస్ ఫీచర్‌తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే అది చదివినా చదవకపోయినా నిర్దిష్ట సమయం తర్వాత డిలీట్ అవుతుంది. అయితే “ఆఫ్టర్ రీడింగ్” ఫీచర్ మాత్రం చదివిన తర్వాత 15 నిమిషాల్లోనే మెసేజ్‌ను తొలగిస్తుంది. ఈ ఫీచర్ విడుదల తేదీపై ఇంకా అధికారిక సమాచారం లేదు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!