
సినిమాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, హర్మూజ్ జలసంధి వద్ద కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు వెళ్తున్న ‘సెలెన్’ అనే కంటైనర్ నౌకను ఇరాన్ దళాలు అడ్డుకున్నాయి. ఈ నౌక షార్జా నుంచి బయలుదేరి కరాచీ వైపు వెళ్తుండగా, హర్మూజ్‌ను దాటే సమయంలో ఆపివేశారు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకారం, నిబంధనలు పాటించకపోవడం మరియు సరైన అనుమతులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. దీంతో ఆ నౌకను తిరిగి వెనక్కి మళ్లించారు. ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన ఈ సముద్ర మార్గంలో భద్రతపై ఈ ఘటన మరింత ఆందోళనలను పెంచుతోంది.



.jpeg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)










.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!