
బిజినెస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ ప్రస్తావన లేకుండానే యుద్ధం ముగింపు దశపై ఆయన స్పష్టత ఇచ్చారు. త్వరలోనే జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తిగా ఉందని పేర్కొంటూ, ఆ ఒప్పందాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ట్రంప్ వెల్లడించారు.
ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన సైనిక చర్యల ప్రభావంతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ దేశం పూర్తిగా కోలుకోవడానికి 15 నుంచి 20 సంవత్సరాల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యుద్ధానికి ముగింపు దశ దగ్గర పడుతున్న సంకేతాలుగా వీటిని విశ్లేషకులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!