

అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న B1 ఏసీ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
మంటలు గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును ఎలమంచిలి స్టేషన్లో నిలిపివేశారు. అయితే మంటలు క్రమంగా పక్కనే ఉన్న M2 బోగీకి కూడా వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పలువురు బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది మిగతా కోచ్‌లను అగ్నిప్రమాదం జరిగిన బోగీల నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఈ రైలు ప్రమాదం కారణంగా అనకాపల్లి చేరుకునే సమయానికి సుమారు నాలుగు గంటలు ఆలస్యం అయింది. నర్సింగబల్లి దాటిన కొద్దిసేపటికే B1 ఏసీ బోగీలో బ్రేకులు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాల పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!