

మాజీ భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశోక్ డిండా రాజకీయ జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్రికెట్ మైదానం నుంచి రాజకీయ రంగం వరకు ఆయన ప్రయాణంలో మరో ముఖ్య ఘట్టం నమోదైంది.
సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డిండా 16,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2021లో బీజేపీలో చేరిన ఆయన తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనదైన గుర్తింపు సంపాదించారు. అంతకుముందు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డిండా 13 వన్డేలు, 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!