

ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఈ పరికరాన్ని 2027 చివర్లో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సవాళ్ల కారణంగా ప్రాజెక్టు పురోగతి ఆశించినంత వేగంగా సాగడం లేదని తెలుస్తోంది. గతంలో 2026 చివర్లో ప్రకటించి, 2027 ప్రారంభంలో విక్రయాలు ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
ఆపిల్ భవిష్యత్ ఉత్పత్తుల వ్యూహంలో ఈ స్మార్ట్ గ్లాసెస్ కీలక పాత్ర పోషించనున్నాయి. అప్‌గ్రేడ్ చేసిన సిరి, విజువల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన ఏఐ ఫీచర్లతో ఈ గ్లాసెస్ రానున్నట్లు సమాచారం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పలు ఫ్రేమ్ డిజైన్లు, రంగుల ఎంపికలను సంస్థ పరిశీలిస్తోంది. పూర్తి స్థాయి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సపోర్ట్ ఉండకపోయినా, భవిష్యత్తులో ప్రత్యేక డిస్‌ప్లేతో కూడిన అధునాతన AR గ్లాసెస్‌ను కూడా ఆపిల్ అభివృద్ధి చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో మెటా, గూగుల్ వంటి సంస్థలు స్మార్ట్ గ్లాసెస్ రంగంలో పోటీని మరింత వేగవంతం చేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!